ఎపి స్టడీ సర్కిల్ భూములను ఇతర అవసరాలకు మళ్లీస్తే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది.. కలెక్టర్ కు పిర్యాదు చేసిన విదసం కన్వీనర్ డాక్టర్. బూసి.

MEDIA POWER
0

ఎస్సీ ల ప్రయోజనార్థం నిర్మించిన స్టడీ సర్కిల్ భూములను ఇతర అవసరాలకు వాడటం చట్ట రీత్యా నేరం అనే తీర్పులు పరిగణనలోకి తీసుకుని స్టడీ సర్కిల్ భూములు కాపాడాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి ని కోరారు.

ఐఏఎస్  అభ్యర్థుల శిక్షణ నిమిత్తం రుషి కొండ వద్ద 3.6 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించింద ని, దీనిలో 1.6 ఎకరాల భూమి టి టి డి వారికి ఇవ్వ గా మళ్లీ కొంత భూమిని టి టి డి కోరడం ఎస్సీ లకు అన్యాయం చేయడం అని ఆరోపించారు. 

నెల్లూరు కబాడిపాలెం లో ఎస్సీ సామాజిక భవనం ప్రాంగణంలో ప్రభుత్వం సచివాలయం నిర్మించిన కేసులో ఎపి హై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఎస్సీ ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను  వేరే అవసరాలకు వినియోగించడం  చట్ట రీత్యా నేరమని తీర్పు చెప్పిన నేపథ్యంలో ఎస్సీ ల స్టడీ సర్కిల్ భూముల ను టిటిడి మరీ మరీ కోరడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందన్నారు,. ప్రభుత్వం విద్యా సంస్థల భూములు లో సచివాలయం, రైతు బరోసా కేంద్రాల నిర్మాణo పై కూడా వచ్చిన హై కోర్టు తీర్పు లు, వాటి అమలు లో అలసత్వం పై 8 మంది ఐ ఎ ఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించిన అంశాన్ని దళిత సంఘాల నాయకులు డిఆర్ఒ దృష్టికి  తెచ్చారు.

దీని పై డిఆర్ఒ స్పందిస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే ఆనంద కుమార్, సోడా దాసి సుధాకర్, బల్లoకి కనక రాజు, కస్తూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">