ఏపీ కొత్త కేబినెట్ అధికారికంగా ఖరారు
గవర్నర్ కు జాబితా పంపిన ప్రభుత్వం
ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ ఎంపిక చేసిన సీఎం జగన్
గతంలో 25 మందితో ఉన్న కేబినెట్ లోని అందరితోనూ రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే. అయితే తాజా కేబినెట్ ను 25 మందితో అభ్యర్థులతో సిద్దం చేసారు. అందులో పాత కేబినెట్ నుంచి 11 మందిని కొనసాగిస్తున్నారు. అదే విధంగా కొత్తగా 14 మందితో కేబినెట్ కూర్పు పూర్తి చేసారు. రేపు ఉదయం 11.31 గంటలకు వీరు ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో స్థానం ఖరారు చేసిన వారికి సీఎంఓ నుంచి ఫోన్లు చేస్తున్నారు.
పది మంది పాత మంత్రులు యధాతదం
తాజా సమీకరణాల్లో పాత కేబినెట్ లో మంత్రులుగా పని చేసిన బొత్సా సత్యనారాయణ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సిదిరి అప్పలరాజు.. చెల్లుబోయిన వేణు గోపాలక్రిష్ణ.. గుమ్మనూరు జయరాం...... నారాయణ స్వామి..కొడాలి నాని.... ఆదిమూలపు సురేష్.... విశ్వరూప్ ...అంజాద్ బాషా తో పాటుగా తానేటి వనితను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా 15 మందికి అవకాశం కల్పించారు. ఈ సారి కేబినెట్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు ను ఎంపిక చేసారు. ఇదే జిల్లా నుంచి అప్పలరాజు కొనసాగనున్నారు. విజయనగరం నుంచి బొత్సాను కొనసాగిస్తూనే... ఎస్టీ కోటాలో రాజన్న దొరక కు అవకాశం ఇచ్చారు. విశాఖ నుంచి అవంతి శ్రీనివాసరావు మంత్రిగా కొనసాగనున్నారు. కొత్త కేబినెట్ లో గుడివాడ అమర్నాధ్ తో పాటుగా బూడి ముత్యాల నాయుడును ఖరారు చేసారు.
అంబటికి అవకాశం
తూర్పు గోదావరి నుంచి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ.... పినిపె విశ్వరూప్ ను కొనసాగిస్తూనే.. తుని ఎంఎల్ఏ దాడిశెట్టి రాజాకు స్తానం కల్పించారు. పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనితను కొనసాగిస్తూ.... కొత్తగా కారుమూరి నాగేశ్వరరావు..కొట్టు సత్యనారాయణ కు అవకాశం ఇచ్చారు. క్రిష్ణా జిల్లా నుంచి కొడాలి నాని తో పాటు అదే జిల్లా నుంచి జోగి రమేష్ కు అవకాశమిచ్చారు. గుంటూరు నుంచి అంబటి రాంబాబు... విడదల రజని...మేరుగ నాగార్జున మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో గుంటూరు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.
ఎస్సీ - బీసీలకు అత్యంత ప్రాధాన్యం