అభివృద్ధి కోసమే అప్పులు....మంత్రి బొత్స సత్యనారాయణ

MEDIA POWER
0


అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పారదర్శకత కోసమే కొత్త మున్సిపల్‌ పన్నుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు శాపనార్థాలే తమకు దీవెనలని బొత్స అన్నారు. ఆయన చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇష్టారీతిన పన్నులు వేస్తూ ప్రజలను బాధిస్తున్నామని చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రంలోని ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకి తగదన్నారు. ప్రజా శ్రేయస్సును కోరి కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అప్పులు పెరిగాయని.. ఇది ఎక్కడైనా సహజమేనని బొత్స వివరించారు. స్థానిక ఎన్నికల్లో ఇంత ఓటింగ్‌ శాతంతో గెలుస్తామని తెదేపా చెప్పగలదా? అని బొత్స ప్రశ్నించారు. కొవిడ్‌ కారణంగానే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం కావాలనే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల గురించి వైకాపాకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. మాన్సాస్‌ ట్రస్టుపై స్పందించిన మంత్రి  మాన్సాస్‌ ట్రస్టు రద్దు చేయాలని అశోక్‌గజపతిరాజు గతంలో లేఖ రాశారని అన్నారు. ట్రస్టు ఛైర్మన్‌గా ఆనందగజపతిరాజు ఉండడం ఇష్టం లేకే అశోక్‌ లేఖ రాసినట్లు చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు ప్రభుత్వంలో విలీనం చేయొద్దని గతంలో ఆనంద్‌ విజ్ఞప్తి చేశారని, ఆయన విజ్ఞప్తి మేరకు ట్రస్టు ఛైర్మన్‌గా ఆనంద్‌నే కొనసాగించినట్లు బొత్స వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">