అధికారికంగా భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శతవసంతాల వేడుకలు - భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు

MEDIA POWER
0


భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శత వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయాన్ని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం, శతవసంతాల వేడుకల అధ్యక్షులు గాడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో పాఠశాల పూర్వ విద్యార్థులు గంటా శ్రీనివాసరావును ఆయన నివాసంలో కలిసి శతవసంతాలు వేడుకలకు ఆహ్వానించి, వేడుకలు ఏర్పాట్లపై వివరించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి చరిత్ర తెలిసేలా పాఠశాల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా ప్రభుత్వం ద్వారా అధికారికంగా శతవసంతాలు వేడుకలు నిర్వహించడానికి కృషి చేస్తానని, రాష్ట్రంలో వంద సంవత్సరాలు పూర్తయిన పాఠశాలలు అరుదుగా ఉంటాయని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉత్సవాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అధ్యక్షులు గాడు అప్పలనాయుడు మాట్లాడుతూ విదేశాల్లో కూడా పూర్వ విద్యార్థులు ఉన్నారని డిసెంబర్ నెల అయితే అందరూ రావడానికి అవకాశం ఉంటుందని మూడు రోజులపాటు శతవసంతాలు వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి భీమిలి ఇన్చార్జి కోరాడ రాజబాబు, శతవసంతాల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మాదా పార్వతీశం, కంటుభుక్త ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు, కార్యదర్శి చౌదరి సత్యరాజు, కోశాధికారి పూసర్ల శ్రీనివాసరావు, కన్వీనర్లు మైలపల్లి షణ్ముఖరావు, ప్రధానోపాధ్యాయులు పొన్నగంటి రమణ, సభ్యులు కాళ్ళ సన్నీ, చిలకా రమణ, అత్తిలి చినబాబు, మీసాల ఉపేంద్ర, మారోజు గోపి, దేవానంద్ రాజు, బండారు సుధాకర్, బసవ కృష్ణమూర్తి రాజేటి, గందా రాము, కందుకూరి నాగేశ్వరరావు, లచ్చుబోతు ఆదినారాయణ, ఉమా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">