హైదరాబాద్‌కు తరలి వస్తున్న పవన్‌ అభిమానులు.. కారణం అదే!

MEDIA POWER
0




పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన  భీమ్ల్లానాయక్‌ చిత్రం
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న
నేపథ్యంలో పవన్‌ అభిమానులంతా హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరోసారి పవన్‌ సినిమాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న భీమ్లానాయక్‌ సినిమాపై మరోసారి అంక్షలు విధించింది.

బెనిఫిట్‌ షో సహా ఐదో షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అంక్షలు విధించింది. పలు రకాలుగా సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ టికెట్‌ విక్రయాలు కూడా ప్రారంభం కాలేదు. ప్రభుత్వ వేధింపులకు విసిగిపోయిన అభిమానులు హైదరాబాద్‌లో దర్జాగా శ్యామ్‌ సింగరాయ్‌’ సమయంలో టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ  మాట్లాడిన హీరో నానిపై కక్ష సాధించారు. థియేటర్‌లకు పలు రకాల అంక్షలు విధించి సినిమా నష్టపోయేలా చేశారు. ఆ తర్వాత విడుదలైన ఏ చిత్రం జోలికి ప్రభుత్వం అధికారులు వెళ్లలేదు. ఎలాంటి ఆంక్షలు విధించలేదు.

ఇప్పుడు ఉన్నట్టుండి ఐపీ అధికారులకు ఆంక్షలు,  థియేటర్ల భద్రతా విషయాలు గుర్తొచ్చాయి. కేవలం పవన్‌కల్యాణ్‌ సినిమా కావడం వల్లే రాత్రికి రాత్రి కొత్త ఆంక్షలు ప్రవేశపెట్టారని అభిమానులు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం పవన్‌ సినిమాకు ఇంకెన్ని ఆంక్షలు విధిస్తుందో చూడాలి. సినిమా చూడొచ్చని భాగ్యనగరానికి బయలుదేరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">