భక్తుల సమక్షంలో రాములోరి పెళ్లి..

MEDIA POWER
0


శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని
ఘనంగా జరుపుకోవడం ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది. ఈ పండుగను హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి ఆలయంలో శ్రీరామ కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తుంటారనే సంగతి తెలిసిందే. కానీ..కరోనా కారణంగా ఏకాంతంగా పూజలు నిర్వహంచాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది.

వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో ఆలయాల్లో విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నారు.ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా నిరాడంబరంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి, ఉగాది పంచాంగ శ్రవణాలు భక్తుల సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 10వ తేదీన కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతినివ్వడం జరిగిందని వెల్లడించారు.

కళ్యాణం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. ఏప్రిల్ 02వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి తెలిపారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">