ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చకు అనుమతి

MEDIA POWER
0

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై మరోసారి స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. వైసీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇచ్చిన లేఖ మేరకు ప్రభుత్వం ఇవాళ చర్చను ప్రారంభించింది. రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని, శాసన సభలకు శాసనాలు చేసే హక్కులేదని గత ఇరవై రోజుల క్రితం ఏపీ హైకోర్టు తీర్పునివ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అసలు శాసన సభకు, మండలికి ఉన్న హక్కులు ఏమిటి, సభ్యులకున్న అధికారాలు ఏమిటి అనే విషయంలో శాసనసభ చర్చిం చాలని స్పీకర్‌కు లేఖ రాయడంతో ఇవాళ స్పీకర్‌ స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాధరావు మాట్లాడుతూ శాసన సభ హక్కులపై హైకోర్టు తీర్పుపై అనేక మంది సీనియర్ సభ్యులు, మాజీ న్యాయమూర్తులతో చర్చించానని స‌భ‌కు తెలిపారు. కోర్టులంటే అందరికీ గౌరవం ఉందన్న ఆయ‌న చరిత్ర చూస్తే రాజ్యాంగం అంటే ప్రజలని, ప్రజల కోసం రాజ్యాంగం అని వివ‌రించారు. భారతదేశంలో రాజ్యాంగమే గొప్పదని అన్నారు. శాసన, కార్య, న్యాయ వ్యవస్థలకు వాటి విధులపై స్పష్టత ఉండాలని , ఆ స్పష్టత ఇప్పటికీ లేదంటే మనం ఆలోచన చేయాల్సిందేనని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">