పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం,,బొత్స వార్నింగ్

MEDIA POWER
0


కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం
.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘పన్నలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం’అంటూ వ్యాఖ్యానించారు.


పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. చెత్త పన్ను కట్టలేదంటూ కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తాం అని వ్యాఖ్యానించారు.కరెంట్‌ బిల్లు వంకతో కరెంట్‌ కట్‌ చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు..ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ విధానం ఇవాళ కొత్తగా వచ్చిందా? అని ప్రశ్నించారు.

కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామనటం తప్పు అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు..పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ప్రశ్నించారు. ఆస్తులను జప్తు చేయటం మా ఉద్దేశ్యం కాదు.. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">