ఘనంగా బంగారమ్మ పరస మహోత్సవం

MEDIA POWER
0

 

--వైభవంగా ఎల్లమ్మ తల్లి పండుగ

--ముత్యాలమ్మ మారువారం పండుగ

--రూ.25వేలు విరాళం అందించిన గంట్ల


సింహచలం,మార్చి24: అప్పన్న సోదరి, ఏడు గ్రామల ప్రజల ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి పరస మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక సిడిగంపేటలో కొలువైన ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవం వైభవంగా జరిపించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో సింహచలం దేవస్ధానం దర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు ఈ కార్య్ర‌క‌మంలో పాల్గొని ప్రత్యేక పూజులు నిర్వహించారు. అమ్మవార్లుకు పసుపు,కుంకమలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులకు గంట్ల శ్రీనుబాబు దంపతులు రూ.25వేలు విరాళంగా అందజేశారు. ఇక వేపగుంట ప్రజల గ్రామదేవత ముత్స్యమాంబ అమ్మవారి మారువారం పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని గంట్ల శ్రీనుబాబు దంపతులు దర్శించుకని ముడుపులు, మొక్కుబుడులు చెల్లించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">