ఇక మీదట ఏపీ బాధ్యత మొత్తం జనసేన చూసుకుంటుంది

MEDIA POWER
0


పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో
పదే పదే కొందరు వైసీపీ నేతల పేర్లను ప్రస్థావించారు.వారిని ఒక విధంగా ఆయన టార్గెట్ చేశారనే చెప్పాలి. ఆ నేతల పేర్లను కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేస్తూ తనకు వారి మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించారు.దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని వెల్లంపల్లి వెల్లుల్లిపాయ అంటూ ఎకసెక్కం ఆడిన పవన్ మరో  మంత్రి అవంతి శ్రీనివాసరావుని బంతి చామంతి గోడకు కొట్టిన బంతి అవంతి అంటూ కామెంట్స్ చేశారు.

ఇక మరో కీలక నేత అంబటి రాంబాబుని రాంబో రాంబాబుగా పిలవడం విశేషం. వీరందరికీ ఒక ఎత్తు అయితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి మాత్రం భీమ్లా నాయక్ టైప్  లో ట్రీట్మెంట్ తప్పదని పవన్ హెచ్చరించడం విశేషంగా చెప్పాలి. ద్వారంపూడి ఇకనైనా సరిగ్గా వ్యవహరించకపోతే ఫ్యూచర్ లో బిగ్ ట్రబుల్స్ తప్పని పవన్ తనదైన శైలిలో సభలోనే చెప్పేశారు.అదే విధంగా వైసీపీ మంత్రులు నోటి దొరుసుని బూతు మాటలను ఆయన ఇండైరెక్ట్ గానే విమర్శించారు. 

పోలీసుల మీద చేయి చేసుకునే దాకా వైసీపీ నేతల చేష్టలు వెళ్ళిపోయాయని పవన్ అంటూ విశాఖలో శారదాపీఠం దగ్గర ఒక సీఐ మీద ఆగ్రహించిన మంత్రి సీదరి అప్పలరాజు గురించి క్రిష్ణ లంకలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఒక అర్ధ రాత్రి చేసిన హడావుడి గురించి కూడా పవన్ ఇండైరెక్ట్ గా ప్రస్థావించారు.మొత్తానికి పవన్ తన స్పీచ్ మొత్తం వైసీపీ సర్కార్ పాలనను చాకి రేవు పెడుతూనే కీలక  నేతలను కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా మాటలతోనే వడ్డించేశారు.  

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">