సీఎం జగన్‌‌కు కోర్టు సమన్లు

MEDIA POWER
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి
నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సమన్లు జారీ చేయడం ఇదే మొదటిసారి. దాదాపు ఏడేళ్ల క్రితం నాటికి ఓ కేసుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసింది. 2022, మార్చి 28వ తేదీ సోమవారం కోర్టుకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. అయితే.. జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును సీఎం జగన్ తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. కానీ.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా సీఎం జగన్ కు నాంపల్లి కోర్టు 

అసలా కేసు ఏంటీ ?

2014లో హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలు ఎన్నికల కోడ్ నిబంధనల్లు ఉల్లంఘించారని కేసు నమోదైంది. జాతీయ రహదారిపై ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని కేసు పెట్టారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూ వస్తోంది. కేసు నమోదైన వారు న్యాయస్థానానికి హాజరై వివరణ ఇవ్వడంతో వారు కేసు నుంచి బయటపడ్డారని సమాచారం. అప్పటి నుంచి జగన్ న్యాయస్థానం ఎదుట హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. మరి సీఎం జగన్ న్యాయస్థానం ఎదుట హజరవుతారా ? లేదా ? అనేది చూడాలి.సమన్లు జారీ చేయడం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది..

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">