సోమవారం గుంటూరు జిల్లా ఇప్పటంలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని అని సినీ నటుడు నాగబాబు విమర్శించారు. మళ్లీ జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
నాగబాబు మాట్లాడుతూ ఏపీకి రాజధాని లేకుండా 3 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి సీఎం జగన్ విమర్శించారు.రైతులు, జనసేన పోరాటం ఫలించి ఏపీకి రాజధాని అమరావతే అయిందన్నారు. ప్రజల పోరాటంతో ఏపీకి అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ఏపీకి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ఎవరైనా బాగున్నారా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మిగిలిన రాష్ట్రాల ప్రజలు జాలిగా చూస్తున్నారని తెలిపారు.రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్ ను దోచుకుంటున్నారని విమర్శించారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉందన్నారు. కారులో వెళ్తుంటే పాడెపై మోసుకెళ్లినట్లుందని జనం అంటున్నారని పేర్కొన్నారు. కష్టాలు, కన్నీళ్లు, కడగళ్లు తప్ప రాష్ట్రంలో ఏముందని ప్రశ్నించారు. కష్టాలు, కన్నీళ్లు, కడగళ్లు మరిచిపోవడానికే కొత్త రకం బ్రాండ్లు అని అన్నారు.ఏపీలో ప్రతీ పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందన్నారు. ప్రజల వెన్నెముక పవన్ కళ్యాణ్ అని అన్నారు. సొంత తమ్ముడైనా.. తనకు పవన్ నాయకుడేనని తెలిపారు. ప్రజల తరపున పోరాడేందుకు పవన్ వచ్చారని పేర్కొన్నారు. నిలబడదాం..కలబడదాం.. గెలుద్దాం అని పిలుపునిచ్చారు.