ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. యాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తొలి చెక్కు అందచేశారు.
కౌలు రైతు శ్రీ నెరుసు మల్లికార్జునరావు సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. సాగు నష్టాలు, చేసిన అప్పులు తీర్చలేక శ్రీ నెరుసు మల్లికార్జున రావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య శ్రీమతి శివదుర్గను ఓదార్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు.
ఈ సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు ఘంటసాల వెంకట లక్ష్మీ, శ్రీ బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
