కరోనా మహమ్మారి పడగవిప్పనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయిబుధవారం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లోని పలు పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయింది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో సుమారు బుధవారం ఒక్కరోజే 299 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
అంతక్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 50 శాతానికి పెరిగింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.రాజధాని ప్రాంతంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసి ఆన్ లైన్ పాఠాలు బోధించాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
గురువారం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతానికి స్వల్ప సంఖ్యలోనే కరోనా కేసులు బయటపడ్డాయని, ప్రజలు బయాందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. కరోనా నియంత్రణపై విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ ఆధ్వర్యంలో సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని..తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి లేదని మనీష్ శిశోడియా తెలిపారు.
