బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఓ గర్భిణి, పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో నిరీక్షిస్తున్న సమయంలో తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ఈ నేరం జరిగినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న నిందితులు మహిళ భర్తను కొట్టి మరీ దారుణానికి పాల్పడ్డారని సంఘటనా స్థలాన్ని సందర్శించిన బాపట్ల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన 27 సంవత్సరాల మహిళ కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్ళవలసివుంది. ఇంతలో ఈ ఘటన జరటడంతో “బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని' ఎస్పీ తెలిపారు "రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై నేరం ఎలా జరిగింది, అక్కడ ప్రభుత్వ రైల్వే పోలీస్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉన్నారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నామని శ్రీ వకుల్ జిందాల్ చెప్పారు. ఘటనపై ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పద్మ వైద్యులను ఆదేశించారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు.
రేపల్లె రైల్వే స్టేషన్‌లో గర్భిణిపై సామూహిక అత్యాచారం .... నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
May 01, 2022
0
Tags
