గుంటూరు నగరంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఖండిస్తూ, మహిళలకు రక్షణ కల్పించాల్సిన నైతిక బాధ్యత లేనటువంటి ycp ప్రభుత్వంను ప్రశ్నిస్తూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈరోజు జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీనేరెళ్ల సురేష్ గారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్ష చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమాల్ గారు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు గారు, వీరమహిళలు, బోనీ పార్వతినాయుడు గారు, బిట్రగుంట మల్లికగారు, పాకనాటి రమాదేవి గారు అలాగే జిల్లా కార్యవర్గం మరియు నగర జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు,జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
