విద్యార్థులు అందరూ విత్తనాలు సేకరించాలి.... - జె వి రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపకులు

MEDIA POWER
0
విశాఖపట్నం, మీడియా పవర్: విద్యార్థులు అందరూ పక్షులకు ఆహారాన్ని ఇచ్చే, గూళ్ళు పెట్టుకుని వాటిసంతతిని అభివృద్ధి పరుచుకుందుకు, మనందరికీ అవసరమైన ఫలాలను ఇచ్చే చెట్ల విత్తనాలు సేకరించండని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె వి రత్నం కోరారు. మిదిలాపురి రెవెన్యూ కాలనీ లో బుధవారం ఉదయం విత్తనాల సేకరణ కార్యక్రమాన్ని టీం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ విత్తనం కూడా రాలి వృధాగా పోకూడదు అన్నారు. అలాగే మనం ఆరగించిన ఫలాల విత్తనాలను ఆరబెట్టి వచ్చే వర్షాకాలంలో కొండల పై ప్రాంతంలోనూ, చెరువు గట్టు పైన, నదులు సముద్ర తీర ప్రాంతాలలో చల్లాలని సూచించారు. అలాగే పేడ, మట్టి కలిపి విత్తన బంతులు తయారుచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ సాయి ప్రకాష్ మాట్లాడుతూ విత్తనాలు సేకరించడం ఒక అలవాటుగా విద్యార్థులు చేపట్టాలన్నారు. తాము ఎక్కడికెళ్లినా ఆ ప్రాంతంలో లభించే విత్తనాలను సేకరించడం ఒక అలవాటుగా నేర్చుకోవాలని తెలిపారు. అలా సేకరించిన విత్తనాలను వర్షాకాలంలో విభిన్న ప్రాంతాల్లో చల్లడం ద్వారా ప్రకృతిని, ప్రకృతిలో వున్నా అనేక రకాల జీవరాసులని కాపాడుకోవాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిరామీల్ పౌండేషన్ ప్రతినిధులు నేహా, పద్మజ, రెవెన్యూ లేఅవుట్ లోని విద్యార్థులు అధిక సంఖ్యలో విత్తనాలు సేకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">