సిరులిచ్చే సింహాద్రినాధుని చందనోత్సవ‌ ఏర్పాట్లు పూర్తి. .. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్య కళ

MEDIA POWER
0

సింహాచలం, మీడియాప‌వ‌ర్‌: ఉత‌్త‌రాంద్ర ఇల‌వేల్పు  సింహాచలాధీశుడు  శ్రీ వ‌రాహ‌ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం  ఈనెల 3వ తేదీన నిర్వ‌హించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ప‌నులు పూర్తిచేశారు. భక్తులకు, వీఐపీలకు, ఇతర అధికారులకు దర్శనానికి కావ‌ల‌సిన అన్ని ఏర్పాట్లు చేశామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్య కళ ,ఉత్సవ ప్రత్యేక అధికారి డి.భ్రమరాంబ తెలియజేశారు. అత్య‌దిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న స‌మ‌యంతో  భక్తులు వ‌డ‌దెబ్బ‌కు లోనుకాకుండా ఉండేవిధంగా షెడ్లు వేసి, క్యూ లైన్ లో మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ , ఒ ఆర్ ఎస్ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచే విధంగా స‌న్నాహ‌లు పూర్తి చేసారు. ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తిన వారి కోసం మెడికల్  సిబ్బందిని అందుబాటులో ఉంచిన‌ట్టు తెలియజేశారు. భక్తులు హిందూ సాంప్రదాయానుగుణంగా  దుస్తులు ధరించి రావాలన్నారు. భక్తులతో పాటు నాయకులు, విఐపిలు అందరూ ఆలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని ఈ చందనోత్సవం దిగ్విజయంగా జరిపించి స్వామి కృపా క‌టాక్ష వీక్ష‌ణ‌లు పొందాల‌ని తెలియజేశారు. కరోనా కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాల తర్వాత ఈ చందనోత్సవం జ‌రుగుతున్నందున సుమారు  రెండు లక్షల మందికి పైగా  భక్తులు వచ్చే అవకాశం ఉన్న‌ట్టు అంచ‌నా వేసామ‌ని తెలిపారు.  స్వచ్ఛంద సేవా సంస్థలు పోలీసు, రెవిన్యూ జివిఎంసి మెడికల్ సిబ్బంది, విలేకరులు  అందరి సహాయ సహకారాలు అందించి ఈ చందనోత్సవం కు  వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తమ సేవలుఅందించాల‌ని  ప్ర‌తికా ముఖంగా తెలియజేశారు. ద్విచ‌క్ర వాహ‌నాలు, కార్ల‌కు, వ్యాన్ల‌కు దేవస్థానం వారు చూపించిన  పార్కింగ్ స్థ‌లాల‌లో మాత్ర‌మే పార్కింగ్‌ చేసుకోవాల‌ని సూచించారు. కొండపైకి అందరికీ ఉచిత బస్ సర్వీసులు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.  భక్తులు కూడా దేవస్థానం సిబ్బంది చెప్పిన ప్రకారం నడుచుకుని సింహాద్రినాధుని  చందనోత్సవం దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా ఈవో సూర్యకళ కోరారు.  ఈ కార్యక్రమంలో  ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">