కౌలు రైతు శ్రీ మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబానికి రూ. లక్ష ఆర్ధిక సాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమయ్యింది. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు శ్రీ మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. అతని భార్య శ్రీమతి భూలక్ష్మిని ఓదార్చారు. శ్రీ సుబ్బారాయుడు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఆత్మహత్య అనంతరం ప్రభుత్వ స్పందన గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున రూ. లక్ష చెక్కును ఆమెకు ఆర్ధిక సాయంగా అందించారు. బిడ్డల భవిష్యత్తుకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడు భార్య మాట్లాడుతూ.. తన భర్త మృతి చెందిన ఈ రెండేళ్లలో ప్రభుత్వ సాయం కోసం సుమారు వందల సార్లు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నాయకులు శ్రీ చింతా సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
