మే డేగా పిలువబడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు, కార్మికుల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి లేదు’ అని వైఎస్ జగన్ ట్విట్టర్‌లో రాశారు. అభివృద్ధికి మూల స్తంభాలైన కార్మిక శక్తికి సెల్యూట్.. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు' అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరోవైపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయని, పరిశ్రమల స్థాపనతో ఉపాధి కల్పన జరిగిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో కార్మికులకు ప్రమాద బీమా కూడా కల్పించలేని స్థితిలో ఉందని నాయిని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తిరోగమన విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం అంతా ఒక్కతాటిపైకి వచ్చి మేడే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గానికి మేలు చేసే ఏ పోరాటానికైనా టీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, కార్మికవర్గం భాగస్వామ్యం లేకుండా ఏ పాలకుడూ అద్భుతాలు సాధించలేడని వెల్లడించారు.
