న్యూఢిల్లీ: ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్బంగా షాపింగ్ చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జామా మసీదు మార్కెట్ అత్యంత కోలాహలంగా మారింది. మే 2న ప్రారంభమై మే 3న ముగిసే ఈద్-ఉల్-ఫితర్ సందడి మొదలైంది. పండుగకు సామానులు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జామా మసీదు మార్కెట్‌లో ఈద్ షాపింగ్ కోసం జనం బారులు తీరుతున్నారు.
జామా మసీదు మార్కెట్‌లోని సేవాయ్ దుకాణదారుడు ఉమేజ్ జావేద్ ఖాన్ మీడియా పవర్ ప్రతినిధితో మాట్లాడుతూ, "మేము సేవాయిని విక్రయిస్తున్నాము. కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లు రెండేళ్లుగా మూసివేయబడ్డాయి, కానీ ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేయడానికి వచ్చారు, ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇంత భారీస్థాయిలో ప్రజలు రావడం చూడలేదని తెలిపారు. "
ఈ ఏడాది ప్రజలు భారీగా వస్తున్నారని, దీంతో మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉందని శీర్మల్ దుకాణం యజమాని షిరాజుద్దీన్ తెలిపారు.
