విశాఖపట్నం, మీడియా పవర్: కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ కు చేపడుతున్న చర్యల పై సంబంధిత అధికారులతో జిల్లా టాస్కు ఫోర్సు కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందున అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించామన్నారు. క్వారంటయిన్ కేంద్రాలు మరియూ కోవిడ్ కేర్ ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పన, మంచి నాణ్యమైన భోజనం, త్రాగు నీటి సౌకర్యం, మెరుగైన పారిశుధ్యం కల్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. అన్ని కంటైన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు పరచే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఇప్పటికే 2530 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని,వాటిలో 1521 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 963 ఆక్టివ్ కేసులు కోవిడ్ కేర్ సెంటర్లు, నగరంలో గల వివిధ నోటిఫైడ్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారనీ, 46 మంది మృతి చెందారన్నారు. వెరీ యాక్టివ్ క్లస్టర్ 129 , యాక్టివ్ క్లస్టర్ 212, డార్మెంట్ 217 , డీనోటిఫైడ్ 39 ఉన్నాయన్నారు.బెడ్స2,274, వెంటిలేటర్లు 54 ఉన్నాయన్నారు. మూడు శాంపిల్ కలెక్షన్ సెంటర్లు చెస్ట్, ఏ ఎం సీ లలో ఉన్నాయని, రోజుకి సుమారు మూడు వేల మందికి టెస్ట్లు చేస్తున్నారని తెలిపారు. అయితే వీటి సామర్ధ్యం నాలుగు వేలకు పెంచాలని కలెక్టర్ కు సూచించడం జరిగిందన్నారు. అన్ని కోవిడ్ కేర్ ఆసుపత్రులలో డాక్టర్లు ఫార్మ సిస్ట్లు, తదితర సిబ్బంది రెండు వేల మంది వరకూ నిరంతరం పనిచేస్తున్నారన్నారు. జిల్లా లో ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా ఉచితంగా టెస్ట్ లు చేశారన్నారు. పేషంట్ ఇబ్బందులకు గురి కాకుండా కోవిద్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లకు జాయింట్ కలెక్టర్లు ఇద్దరు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. జీవీఎంసీ పరిధిలో కంటన్మెంట్ జోన్లలో నిరంతర శానిటేషన్ అమలు జరుగతున్న దని తెలిపారు. నగరంలో కొంతమంది వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లాక్ డౌన్ పాటిస్తామని తెలియజేశారన్నారు.
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ కంటెంట్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కేసులు వస్తున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల పరిధిలో డి సెంట్రలైజ్డ్ కోవి డ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ,వార్డు సచివాలయ లను ఒక కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామని అక్కడ ట్రూనాట్ పరీక్షల ను చేస్తారన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటెన్మెంట్ జొన్లలో ఫీవర్ క్లినిక్స్ను పెట్టనున్నామ న్నారు. పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపట, ఈఎన్టీ ఆసుపత్రులలో సంజీవని మొబైల్ బస్సుల ద్వారా టెస్ట్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, జీవీఎంసీ కమిషనర్ శ్రీమతి జి . సృజన, జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
సంజీవని మొబైల్ బస్సుల ద్వారా కరోనా పరీక్షలు. మంత్రి అవంతి
July 17, 2020
0
Tags