అమరావతి, మీడియా పవర్ : ‘మూడు రాజధానుల బిల్లు' సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపిం చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత స్వయంచాలికం గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు.
Post a Comment
0Comments
3/related/default