ప్రతి నియోజక వర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ల... జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్

MEDIA POWER
0


విశాఖపట్నం, మీడియా పవర్: కోవి డ్ నియంత్రణకు సంబంధించి ప్రతి నియోజక వర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏ ఎం సీ సమావేశ మందిరములో ఏఏం సి ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, డిఎం& హెచ్ ఓ డాక్టర్ తిరుపతి రావు, డి ఆర్ వో ఎం శ్రీదేవి, ఆరోగ్యశ్రీ  కో ఆర్డినేటర్  డాక్టర్ భాస్కర్ రావు, డీ అర్ డీ ఏ పీ డీ విశ్వేశ్వరరావు తదితరులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నియోజక వర్గ పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు త్వరిత గతిన ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సెంటర్లో 300 పడకలకు తక్కువ కాకుండా బెడ్లు సిద్ధం చేయాలన్నారు. సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు ఇంఛార్జి లు గా వ్యవహరించాల్సి వుంటుందన్నారు. ప్రతీ సెంటర్ వద్ద అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరాన్ని బట్టి పాజిటివ్ పేషంట్లకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క హాస్పిటల్స కి షిఫ్ట్ చేయాలన్నారు. అనంతరం కలెక్టరు కే జి హెచ్ లో కోవి డ్ కేర్ టెస్టింగ్ ల్యాబ్ ను తనిఖీ చేసి అక్కడి పరిస్థితి పై తీవ్ర అసంతృప్తి ని వ్యక్త పరిచారు. టెస్టింగ్ శాంపిల్ వి ఆర్ డీ ఎల్, వి టీ ఎం ఎస్, ఆర్ టీ పీ సీ ఆర్ మిషన్ ద్వారా చేసే పరీక్షలు కు సంబంధించి రిపోర్ట్స ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో సంబంధిత డాక్టర్స, సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్త పరిచారు. టెస్ట్ రిజల్ట్స  24 గంటల లోగా పంపించాలని, ఆలస్యమైన పక్షంలో సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">