యూ.చీడిపాలెం డాక్టర్ కు   షోకాజ్ నోటీస్ జారీ.... ఐటీడీఏ పి.ఓ

MEDIA POWER
0

వైద్యాధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలి ... ఐటీడీఏ పి.ఓ డా. వెంకటేశ్వర్ సలిజమాల ఆదేశం


పాడేరు, మీడియా  పవర్, జూలై  20: మన్యంలో మలేరియా వ్యాప్తి చెందకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని  సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డా.వెంకటేశ్వర్ ఆదేశించారు.  సోమవారం 11 మండలాల పి.హెచ్ సి వైద్యులతో  వీడియో కాంఫరెన్సు  నిర్వహించారు. కరోనా,మలేరియా విస్తరించకుండా వైద్య సేవలను అందించాలన్నారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు స్థానికంగా ఉండకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూ.చీడిపాలెం వైద్యాధికారి డా.సురేష్ కాకినాడ రూరల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసి  షోకాజ్ నోటీస్ జారీచేశారు. రక్తపుపూతల  సేకరణలు పెంచాలని ఆదేశించారు. రక్తపు పూతల సేకరణ లో  మినుములూరు, సప్పర్ల, యూ.చీడిపాలెం, కిలగాడ పి. హెచ్.సి లు వెనుకబడ్డాయని అన్నారు. ఏసీఎం పిచికారీ పనులు వేగం పెంచాలని సూచించారు. డెంగ్యూ సోకకుండా  డ్రైడే పాటించాలన్నారు. అనంతరం మనబడి నాడు నేడు పనుల పురోగతి పై ఇంజినీరింగ్ అధికారులు,హెచ్ ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే వారానికి నాడు నేడు పనులు 66 శాతం ప్రగతి సాధించాలని అన్నారు. భవన నిర్మాణాలకు  స్థానిక ఇసుక వినియోగించవద్దని పేర్కొన్నారు. గూడ ఆశ్రమ పాఠశాలలో 30 టాయిలెట్స బ్లాక్లు ఉండగా వాటి మరమ్మతులు చేయకుండా కొత్తగా నాలుగు నిర్మిస్తున్నారని హెచ్.ఎం. ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏజెన్సీలో చేస్తున్న నాడు నేడు పనులకు ఇసుక కొరతలేకుండా ఇసుక సరఫరా చేయాలని జిల్లా ఇసుక  అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డి ఎం ఓ మణి, పీవో డిడిటి డా.రత్న కుమార్ , గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ కుమార్, వైద్యాధికారులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, ఎం.ఈ .ఓలు ,హెచ్ ఎం లు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">