జీవీఎంసీ 19వ వార్డు పరిధిలో పర్యటించిన రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి .

MEDIA POWER
0

జీవీఎంసీ 19వ వార్డు పరిధిలోని  వాసువాని పాలెం, జాలరి పేట తదితర ప్రాంతాల్లో రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయి రెడ్డి పర్యటించారు.  ఆయన మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసు కున్నారు.  హుదూద్ తుఫాను సమయంలో  ఇల్లు కోల్పోయిన మత్యకార కుటుంబాలకు న్యాయం చేస్తామని  ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.   తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం జన్మభూమి కమిటీ సభ్యులను  మాత్రమే  లబ్ధిదారులుగా గుర్తించడం జరిగిందని, నిజంగా  ఇల్లు కోల్పోయిన ఎవరికీ కూడా న్యాయం జరగలేదని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  అదేవిధంగా రింగు వలల మత్స్యకారులకు సాంప్రదాయ వలల మత్స్యకారులకు మధ్య తలెత్తిన సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకురాగా ఇప్పటికే ఒక కమిటీ వేశామని  కమిటీ నివేదిక రాగానే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు.   అదేవిధంగా పారిశుధ్య సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకురాగా జివిఎంసి వారితో మాట్లాడి ఈ సమస్యను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివిసత్యనారాయణ, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల,  దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్,  నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్నికల పరిశీలకులు  విజయ్కుమార్ బొడ్డు అప్పలనాయుడు, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, వైస్సార్ సీపీ  నాయకులు అక్కరమాని వెంకట్రావు, వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి సురాడా వెంకట్ లక్ష్మి దాసు,  మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ పేర్ల విజయ్ చంద్ర ,18 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి  ధనలక్ష్మి , ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 



Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">