బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున
March 26, 2022
0
విశాఖపట్నం, మార్చి 26: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. మల్లిఖార్జున అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ పిల్లలను కార్మికులుగా మార్చకుండా తల్లి, దండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ బాలలను పనిలో పెట్టుకున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కమిటీ సభ్యులు, అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి గుర్తంచిన పిల్లలను చైల్డ్ కెర్ సెంటర్లకు తరలించాలన్నారు. వారిలో పాఠశాల మాననేసిన బాలికలను కెజిబివి పాఠశాలలో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. బాలకార్మికుల సమాచారం తెలిపినవారికి బాలల ఒక్కింటికి రూ.1000/- ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి. బుల్లికృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సునీత, డి.ఆర్.ఒ శ్రీనివాస మూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ రాథ, బాల సంరక్షణ అధికారి సత్యనారాయణ, చైల్డ్ లైన్ 1098 సెంట్రల్ కోఆర్డినేటర్ డేవిడ్ రాజు, బచ్పన్ బచావో ఆందోళన్ రాష్ట్ర కోఆర్డినేటర్ తిరుపతి రావు, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తదితరలు పాల్గోన్నారు.
Tags
