స్కానింగ్ కేంద్రములలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డా.ఎన్.వసుందర, నోడల్ అధికారి, (పి.సి.పి.ఎన్.డి.టి) మాట్లాడుతూ జిలాలో స్త్రీ పురుష నిష్పత్తి తగ్గకుండా చూడవలసిన బాధ్యత మనందరి పై ఉందని ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని తెలియచేసారు. జిల్లాలో క్షేత్ర స్థాయి సిబ్బంది తమ పరిదిలో అబార్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సమావేశాల్లో విశ్లేషించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో డా.కె.విజయ లక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.ఎన్.వసుందర, నోడల్ అధికారి, పి.సి.పి.ఎన్.డి.టి, డెమో శ్రీ బి.నాగేశ్వర రావు, డిప్యూటీ. డెమో శ్రీ రవి చంద్ర పాడి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీమతి. అర్.ఝాన్సీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
“ఆడ బిడ్డను రక్షించండి"....జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
March 26, 2022
0
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరం లో విశాఖ డివిజన్ ఏ.ఎన్.ఎం.లు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు మరియు క్షేత్ర స్థాయి పర్యవేక్షకులకు పి.సి. మరియు పి.ఎన్.డి.టి. ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, మాట్లాడుతూ జనాబా లెక్కల ప్రకారం జిల్లా లో స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. ఇది తగ్గకుండా ప్రజలలో చైతన్యం తీసుకురావాల్సి ఉందని తెలియచేసారు. ప్రజలకు అవగాహన కార్యక్రమంలు “ఆడ బిడ్డను రక్షించండి” నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
Tags
