తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ధర్మరథం బస్సులో మంటలు రేగాయి. సాయంత్రం శ్రీవారి సేవకులను బస్సులో తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్‌రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును లింక్ రోడ్డు వద్ద నిలిపివేసారు. తర్వాత అందులో ఉన్న భక్తులంతా దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల ఘాట్‌రోడ్డులోనూ ఓ కారులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
Post a Comment
0Comments
3/related/default
