అభిమానులకు గుడ్న్యూస్ అందించింది ఆహా ఓటీటీ. ఈ సినిమాను అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ రచ్చ చేయనున్నట్లు ప్రకటించారు. ఆహా ఓటీటీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
అయితే, తెలుగు వారి ఓటీటీగా ప్రేక్షకులకు దగ్గరైన ఆహా.. భీమ్లా నాయక్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన రాయల్ ఎన్‌ఫిల్డ్ రేర్ మోడల్ బైక్ గుర్తుందా.. సినిమాలో పవన్ ఎంతో స్టైలిష్‌గా వాడిన ఈ బైక్ చాలా సన్నివేశాలలో కనిపిస్తుంది. కాగా, ఇప్పుడు ఆ బైక్ ను ఆహాలో భీమ్లా నాయక్ చూసే ప్రేక్షకులు సొంతం చేసుకొనే ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తుంది.
లక్కీ డ్రా ద్వారా ఆహా సబ్ స్క్రైబర్లలో ఒకరికి ఈ బైక్ అందించనున్నారట.మార్చి 24 అర్ధరాత్రి 12 గంటలకు భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అయిన అనంతరం ఆహా ఓటీటీని కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకొనే వారిని లక్కీ డ్రా తీసి ఒకరికి భీమ్లా నాయక్ లో పవన్ వాడిన బైక్ ను అందించనున్నట్లు సమాచారం. కాగా.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షోలో ఆదివారం రోజున నిత్యా మీనన్, థమన్ ఈ లక్కీ డ్రాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉండగా.. అదే షోకు ఆదివారం రానా దగ్గుబాటి కూడా హాజరు కానున్నారట.
