గాడ్‌ఫాదర్‌ కోసం రంగంలోకి దిగిన సల్లూభాయ్‌.

MEDIA POWER
0


బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ఈ
సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా గాడ్‌ఫాదర్‌ షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టాడు సల్లూభాయ్‌. మెగాస్టార్‌ చిరంజీవిస్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. 

సల్మాన్‌తో కలిసున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ గాడ్ ఫాదర్ సెట్లోకి స్వాగతం.  మీ రాక ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇచ్చింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని అందిస్తుందని చెప్పడంలో ఎంటువంటి సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలికారు చిరంజీవి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా లూసిఫర్‌లో పృథ్వీరాజ్‌ కుమార్‌ పోషించిన పాత్రను గాడ్‌ఫాదర్‌లో సల్లూభాయ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సత్యదేవ్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూపర్‌గుడ్ ఫిల్మ్‌ బ్యానర్‌, కలిసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిరవ్‌షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మ్యూజిక్‌ సెన్షేషన్‌ ఎస్‌.థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి తల్లిగా ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేం గంగవ్వ నటించనున్నారు. ఈసినిమాతో పాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో భోళా శంకర్‌, బాబీ, వెంకీ కుడుముల చిత్రాల్లోనూ నటిస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">