ఏపీ శాసనమండలిలో ఎనిమిది మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌.

MEDIA POWER
0

అమరావతి : నాటుసారా మరణాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలిలో మరోసారి ఆందోళన నిర్వహించారు. ఇవాళ నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి మండలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటుసారా మృతుల పాపం జగన్‌రెడ్డిదే అని ప్లకార్డులను ప్రదర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. మండలి సమావేశంలో చిడతలు వాయిస్తూ , విజిల్స్‌ వేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మండలి చైర్మన్‌ అనేకమార్లు టీడీపీ సభ్యులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో 8 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేశారు టీడీపీ ఎమ్మెల్సీలు రామ్మోహన్‌రావు, రాజనర్సింహులు, రామారావు, కేఈ ప్రభాకర్‌, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు లను సస్పెన్షన్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">