నవ రత్న పధకాలకు అన్ని వర్గాల ప్రజలకు సాధారణ బడ్జెట్ నిధులు నుండి ఖర్చు చేస్తుoడగా ఎస్సీ ఎస్టీ లకు మాత్రం సాధారణ బడ్జెట్ నిధులు మంజూరు చేయకుండా వివక్ష చూపుతూ సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నేరం. ఈ చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లను బాధ్యులు గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని లోకాయుక్త కు విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒక ప్రత్యేక చట్టం. ఈ చట్టం కింద దోషుల పై విచారణ, బెయిల్ మంజూరు అధికారం సెషన్స్ న్యాయమూర్తి కి మాత్రమే ఉండగా, పోలీసు అధికారులు స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా బెయిలు మంజూరులో అవినీతికి ఆస్కారం ఉంది, దోషి స్వేచ్ఛగా తిరుగుతూ బాధితులను పరిహాసం మరియు ఛాలెంజ్ చేస్తూ సాక్ష్యలను తారుమారు చేస్తున్నారు. చట్టం నిర్వీర్యం అవుతుంద ని లోకాయుక్త జోక్యం చేసుకుని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గారికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీని పై జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులు తప్పిదం చేస్తే లోకాయుక్త కేసులు నమోదు చేస్తుందని, సబ్ ప్లాన్ విషయం లో లోకాయుక్త పరిది ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ వేమన, సోడ దాసి సుధాకర్, ఈతల పాక సుజాత, వడ్లమూరి ఫ్రాన్సిస్, డి నిర్మల, బంటు కృష్ణా రావు, గుడివాడ అప్పారావు, కస్తూరి వెంకట రావు, డి.విజయ కుమార్, జి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.