కరోనా నాలుగో దశలో చైనాలో మూడు కరోనా మరణాలు

MEDIA POWER
0


కరోనా నాలుగో దశ ప్రారంభమైన చైనాలో మొదటిసారి
మహమ్మారి భారిన పడి ముగ్గురు మృతి చెందడం అధికారుల్లో ఆందోళన కలిగించింది. అయితే మృతుల్లో ఇద్దరు వృద్దులు కాగా మరొకరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా అక్కడి అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల నివేదికలో పూర్తి వివరాలు కొరవడుతున్నాయి. నాలుగో దశలో మహమ్మారి భారిన పడుతున్న వారిలో ఎంత మంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ వేరియంట్, లక్షణాలు వంటి విషయాలను మాత్రం చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. 

గత రెండు నెలలుగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిత్యం సరాసరి 15 వేల కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని షాంఘై సహా తూర్పు ప్రాంతంలోని 27 నగరాలలో కఠిన లాక్ డౌన్, 17 నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు. సోమవారం షాంఘై నగర ఆరోగ్య కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో ఒక్క షాంఘై నగరంలోనే 3,238 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కాగా, మరో 21,582 మందిలో లక్షణరహిత వైరస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఏది ఏమైనప్పటికీ..చైనాలో మరో మారు కరోనా వైరస్ విజృంభించడం కొంత ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రంగా చెప్పుకుంటున్న షాంఘై నగరంలో ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. నగరంలో విధించిన కఠిన లాక్ డౌన్ కారణంగా వారాల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కనీసం ఆహారం కోసం కూడా ప్రజలు గడప దాటే పరిస్థితి లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో సోమవారం నుంచి నగరంలో ఆంక్షలను పాక్షికంగా సడలించింది చైనా ప్రభుత్వం.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">