మొదటి మంత్రి వర్గ విస్తరణంలో మంత్రి పదవి దక్కించుకున్న కొడాలి నాని రెండో విడతలో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అటువంటి కొడాలి నాని పశువుల కొట్టంలో పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఒక పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫొటోను నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి మళ్లీ స్థానం దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ అంచనాలు తల్లక్రిందులయ్యాయి. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కొడాలి నానికి కూడా మంత్రి పదవి దక్కలేదు. పైగా చంద్రబాబుమీద మాటలతో విరుచుకుపడటంలో కొడాలి ముందుంటారు. అటువంటి వ్యక్తికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అందరు భావించారు. కానీ జగన్ మాత్రం తనదైన శైలిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి అందరికి షాక్ ఇచ్చారు.
కానీ కొడాలిపై సీఎం జగన్ కు ఉన్న అభిమానంతో కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. కానీ దాన్ని కొడాలి తిరస్కరించారు. మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లుగా తెలస్తోంది.
ఈ క్రమంలో సడెన్ గా కొడాలి పశువుల కొట్టంలో కనిపించారు. మంత్రి పదవి తనకు అవసరం లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆయన… అంత యాక్టివ్ గా కనిపించడం లేదని నెటిజెన్లు అంటున్నారు. ఈక్రమంలో కొడాలి నాని పశువుల కొట్టంలో పడుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
