కరచాలనానికి చేయి అందిస్తే.. మంత్రి గారి చెంప దెబ్బ,,

MEDIA POWER
0


రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన
తర్వాత శ్రీకాకుళం వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తమ నాయకుడిపై అభిమానంతో ఓ కార్యకర్త చేయి అందించేందుకు ముందుకురాగా.. మంత్రి కోపంతో ఆయన చెంప చెళ్లుమనిపించారు.

ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారు విస్తుపోయారు. శుక్రవారం రాత్రి ధర్మాన స్వాగత ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్తున్న మంత్రితో కరచాలనానికి నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఓ కార్యకర్త అలా ముందుకురాగా.. మంత్రి అతడి చెంపపై కొట్టారు. . అభిమానంతో శుభాకాంక్షలు చెప్పడానికి ముందుకొస్తే మంత్రి ఇలా చేయడం తగునా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">