జనసేన నాయకులని అన్యాయంగా అరెస్ట్ చేసారు

MEDIA POWER
0


పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర
జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలురు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలెక్టర్ గారికి కలిసి అక్రమ ఇసుక మాఫియా గురించి మరియు JP Powers అనే సంస్థ చేస్తున్న అక్రమ ఇసుక తరలింపు గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో వెళ్లిన జనసేన నాయకులను అక్రమంగా 147, 353 సెక్షన్స్ మీద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ అక్రమ అరెస్ట్ గురించి తెలుసుకొని నేడు పార్వతీపురం జనసేన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు మరియు జిల్లా నాయకులు, లీగల్ సెల్ టీం రావడం జరిగింది. అరెస్ట్ అయిన బాబు పాలూరు మరియు నాయకులతో మాట్లాడి అక్కడ జరిగిన విషయాలు అన్ని కనుక్కొని నేరుగా జిల్లా కలెక్టర్ గారిని మరియు SP గారిని కలిసి జరుగుతున్న ఇసుక అక్రమాలు గురించి సాక్ష్యాలతో కలెక్టర్ ముందు ఉంచడం జరిగింది. స్పందించిన కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి విచారణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">