ఒంగోలు 25 వ డివిజన్ నందు గత ఎనిమిది నెలల క్రితం రోడ్డు మార్జిన్ కట్ చేసి వదిలేశారు ఆ గుంత గత ఎనిమిది నెలల నుంచి రిపేర్ చేయకపోవడం తో ఎంతో మంది ఆక్సిడెంట్లకు గురి అయ్యారు. ఆ సమస్యను 25 వ డివిజన్ ప్రజలు జనసేన నాయకుల దృష్టికి తీసుకు రావడం వల్ల సాయంత్రం 8 గంటల సమయంలో ఒంగోలు జనసేన నాయకులు రోడ్డును రిపేర్ చేయించే సమయంలో ఒంగోలు కార్పొరేషన్ వైసిపి డిప్యూటీ మేయర్ బుజ్జి గారు అతని అనుచరులతో వచ్చి జనసేన నాయకులను మీరు రిపేర్ చేయడం కుదరదు చేస్తే మేం చేయాలి లేదా మున్సిపాలిటీ చేయాలి అని తీవ్ర స్వరంతో మాట్లాడుతూ జనసేన నాయకులు అడ్డుకోవడం జరిగింది..
అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైసిపి నాయకులు మీద తిరగబడి గత ఎనిమిది నెలలుగా పట్టించుకోనటువంటి మీరు ఈరోజు చేస్తున్నటువంటి వారిమీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు అని అడగడంతో వైసిపి నాయకులు , వారి అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తదుపరి జనసేన నాయకులు అందరూ కలిసి పాడైపోయిన రోడ్డును సరి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో ఒంగోలు నగర అధ్యక్షులు రమేష్ గారు ,25 వ డివిజన్ అధ్యక్షులు పొకల నరేంద్ర గారు, రాష్ట్ర కార్య క్రమాలు నిర్వ హణ కార్యదర్శి ఈదుపల్లి మణి కుమార్ గారు,33 వ డివిజన్ అధ్యక్షులు హరి గారు ,రెండోవ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మ నాయుడు గారు, ఒంగోలు నగర కార్యదర్శి పోకల హనుమంతరావు గారు,28 అధ్యక్షుడు కోటా సుధీర్ గారు, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి నరేష్ గారు రు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

