పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా నిర్వ‌హించాలి ....డి ఆర్ ఓ పి. వెంకటరమణ

MEDIA POWER
0


* పరీక్ష నిర్వహణకు 32 కేంద్రాలు

* 7889 మంది అభ్య‌ర్ధులు 

అనకాపల్లి మే 27:  జిల్లాలో ఈ నెల 29 వ తేదీన జరిగే పాలిటెక్నిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకట రమణ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఆయన ఛాంబర్ లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .... ఈ పరీక్షలను  32 కేంద్రాల్లో ఉదయం గం.11:00 ల నుండి మధ్యాహ్నం 1:00 వరకునిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జిల్లా లో  మొత్తం 7889 మంది విద్యార్థులు పరీక్షల హాజరు కానున్నార‌ని వీరిలో  4823 మంది బాలురు, 3066 మంది బాలికలు ఉన్ననట్లు తెలిపారు.   సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజా రవాణా సంస్థ అధికారిని, పరీక్ష కేంద్రాల నిర్వహణకు,  స్పెషల్ స్క్వాడ్ లను, పోలీసు బందోబస్తు ఇవ్వాలని పోలీసు అధికారిని కోరారు. పరీక్ష కేంద్రాల్లో  డిపిఓ,  తాగునీటి సరఫరా,  పారిశుద్ధ్యం ఏర్పాట్లు జీవీఎంసీ  చేయాలని,  ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని డీఈఓ లను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షల విజయవంతంగా నిర్వహించాలన్నారు.  సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీష రాణి,  వైద్యాధికారి డాక్టర్ సి.కిషోర్ కుమార్, ఎంఈఓ దివాకర్, అనకాపల్లి, నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపల్స్‌ డా.ఎం. జగన్నాథ్, జి.వి.రామచంద్ర రావు, పోలీసు, విద్యుత్, ప్రజా రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 పౌర సంబంధాల అధికారి ద్వారా జారీ.... అనకాపల్లి

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">