పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం.
అనకాపల్లి, మీడియా పవర్: అనకాపల్లి రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వై.ఎస్.ఆర్.సి పి పార్టీ కార్యాలయములో రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, సమాచార సాంకేతిక విద్య శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన 16 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 8 లక్షల 30 వేల రూపాయల విలువగల చెక్కులను వారి యొక్క కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో భాధపడుతున్న పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చికిత్సకు అయ్యే సోమ్మును ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ఇంతలా పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ప్రజా పరిషత్ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, గున్నయ్య నాయుడు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పలక రవి, 83 వ వార్డు ఇంచార్జ్ జాజుల రమేష్, పొలమరశెట్టి మురళి,పెతకంశెట్టి జగన్ మోహన్ రావు, మున్నూరు శ్రీను, సకల గోవింద్, కోరుకొండ రాఘవ, కె ఎం నాయుడు, దాడి నారాయణరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
