విశాఖపట్నం : పదవీ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి లత మల్లిఖార్జున తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో “ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ యువర్ డిస్ట్రీక్ట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జి.పి.ఎఫ్, ఫించన్ సమస్యలను పరిష్కరించడం కోసం నిర్వహించడం జరిగిందన్నారు. విశాఖ జిల్లాలో సుమారు10సంవత్సరముల నుండి పెండింగ్ లో ఉన్న ఫించనుదారుల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఖజనా శాఖ సంచాలకులు ఎన్ మోహనరావు మాట్లాడుతూ ఫించన్ దారుల నుండి 42 దరఖాస్తులు అందాయని, ఇప్పటి వరకు 85 శాతం పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలినవి వారం రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఖజనా శాఖ ఉపసంచాలకులు టి.శివరామ్ ప్రసాద్, ఖజనా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.