అన‌కాపల్లి పార్కుల‌కు మ‌హ‌ర్ధ‌శ‌..

MEDIA POWER
0

 

అన‌కాప‌ల్లి:  ఈ రోజు అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ 82 వార్డులోని A.M.C కాలని సచివాలయం దగ్గర ఉన్న పార్కును 14.80 లక్షల రూపాయల వ్య‌యంతో వ్యాయామశాల పరికరములు మరియు పార్క్ ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర  పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖామాత్యులుగుడివాడ అమర్నాథ్ ముఖ్యఅతిథిగా  విచ్చేసారు. పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఈ ప‌రిక‌రాల‌ను వినియోగించి శ‌రీర ధారుడ్యంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల‌ని సూచించారు. గ‌త ప్ర‌భుత్వాలు ఎప్పుడూ కూడా ప్ర‌జ‌ల ఆరోగ్యంపై ఆలోచించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. ఆరోగ్య‌మే మ‌హా భాగ్యం అని న‌మ్మిన మ‌న ప్రియ ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కొసం అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మందపాటి సునీత, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్స‌న్‌ పలకా యశోద- రవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, 83 వ వార్డు ఇంచార్జ్ జాజుల, రమేష్ జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, A E సుమిత్ర, కొణతాల మురళికృష్ణ, మ‌రియు అన‌కాపల్లి జిల్లా క్రికెట్ అసోషియేష‌న్ అధ్య‌క్షులు డా.జి.రామ‌మూర్తి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.   

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">