బిలియనీర్ బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు,,కొత్త కొవిడ్ వేరియంట్ చాలా డేంజరస్..

MEDIA POWER
0


బిలియనీర్ బిల్ గేట్స్
మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొవిడ్ కొత్త వేరియంట్ తో గత వేరియంట్ల కంటే ఐదు శాతం ముప్ప‌ు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దాంతోపాటు ప‌రిస్థితులు చేజారకముందే చక్కదిద్దుకోవాలని హెచ్చరించారు. కొవిడ్ కొత్త వేరియంట్ ప్ర‌మాద‌ తీవ్రత, వ్యాపించ‌డంలోని వేగం ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు.

ఈ కొత్త వేరియంట్ వల్ల ప్ర‌పంచానికి ముప్పు పొంచి ఉందనే బిల్ గేట్స్ సూచనలు కొత్తేం కాదు. గతంలోనూ విపత్తుల గురించి పలుమార్లు హెచ్చరించాయన.ప్ర‌పంచ దేశాల‌ను బిల్‌గేట్స్ తొలిసారి బ‌హిరంగంగా 2015లో హెచ్చ‌రించారు. యావ‌త్ ప్ర‌పంచం కొవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేద‌న్నారు. త‌దుప‌రి మ‌హ‌మ్మారిని ఎలా ఎదుర్కోవాల‌న్న విష‌య‌మై బిల్‌గేట్స్ పుస్త‌కం రాశారు. 

ప్ర‌పంచ ఆరోగ్య ముప్పును త్వరిత‌గ‌తిన గుర్తించ‌డంతోపాటు ప్ర‌పంచ దేశాల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి అంటు వ్యాధుల నిపుణులు, కంప్యూట‌ర్ నిపుణుల‌తో ఒక టీంను సృష్టించాల‌ని సూచించారుభ‌విష్య‌త్ మ‌హ‌మ్మారుల‌ను నివారించ‌డానికి భారీ పెట్టుబ‌డులు పెట్టాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుత కొవిడ్ మ‌హ‌మ్మారి నుంచి ఇంకా ముప్పు పొంచి ఉంద‌ని, ఇన్‌ఫెక్ష‌న్ సోక‌కుండా దీర్ఘ‌కాలం రోగ నిరోధ‌క శ‌క్తి గ‌ల వ్యాక్సిన్ల‌ను అత్య‌వ‌స‌రంగా అమల్లోకి తీసుకురావాల్సి ఉంద‌ని స్పష్టం చేశారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">