జమ్మూ కాశ్మీర్‌లోని పరిపాలన కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని లోయలో జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనుమతించడం లేదని ఆరోపణ.
న్యూఢిల్లీ, మీడియా పవర్ న్యూస్ డెస్క్: కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ఉన్నత స్థాయి సమావేశాలకు నిర్వహించి చర్య తీసుకోవాల్సిన సమయం అని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. లక్షిత హత్యల కారణంగా కాశ్మీరీ పండిట్‌లు లోయను విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కేంద్రం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.
లోయలో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేస్తూ జరిగిన హత్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ చేపట్టిన నిరసన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, “బీజేపీ ప్రభుత్వం హత్యలను అరికట్టడంలో విఫలమైందని అన్నారు. 1990 యుగం మళ్లీ రావడం ప్రభుత్వానికిఎలాంటి ప్రణాళికలు లేవని తెలుపుతున్నాయని అన్నారు. లోయలో హత్య జరిగినప్పుడల్లా, హోంమంత్రి అత్యున్నత స్థాయి సమావేశాన్ని పిలిచారని వార్తలలో రావడం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశాలు కాదు..ఎటువంటి చర్య తీసుకున్నారన్నదే ముఖ్యం అన్నారు. కాశ్మీర్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు."
జమ్మూ కాశ్మీర్‌లోని పరిపాలన కాశ్మీరీ పండిట్‌లను ఇటీవలి లోయలో లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే, ప్రజలు కచ్చితంగా తగిన విధంగా బుద్ది చెప్తారని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ నాలుగు ప్రధాన అంశాలపై క్రేంద్రాన్నిడిమాండ్ చేయడమే కాకుండా అటువంటి సంఘటనలను ఆపడానికి కార్యాచరణ ప్రణాళికను డిమాండ్ చేశారు. కాశ్మీర్ వెలుపల పని చేయలేరని కాశ్మీరీ పండిట్‌లతో సంతకం చేసిన బాండ్లను రద్దు చేయాలన్నారు. కాశ్మీరీ పండిట్ల డిమాండ్లను నెరవేర్చాలని, చిల్లర వ్యూహాలను ఆపాలని కోరారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని చెప్పారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా పేరుతో ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు, ఎంపీలందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేసారు. "ఈరోజు కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోస్తున్న తరుణంలో మీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారని నేను మోడీని అడగాలనుకుంటున్నాను?" అని సింగ్ అన్నారు.
కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా తీవ్రవాద గ్రూపులు ఎనిమిది లక్ష్య హత్యలను చేసిందని, వీరిలో ముస్లిమేతరులు, భద్రతా సిబ్బంది, ఒక కళాకారుడు మరియు స్థానిక పౌరులు ఉన్నారని తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాకు చెందిన ఒక మహిళా టీచర్‌ను మే 31న దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని పాఠశాలలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. మే 18న ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా వద్ద ఉన్న వైన్‌షాప్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించి గ్రెనేడ్ విసిరి ఒకరిని చంపారు. ఈ ఘటనలో జమ్మూ ప్రాంతానికి చెందిన వ్యక్తి మరియు మరో ముగ్గురు గాయపడ్డారు. మే 24న శ్రీనగర్‌లోని తన నివాసం వెలుపల పోలీసు సైఫుల్లా ఖాద్రీని కాల్చి చంపగా, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ మరో రెండు రోజుల అనంతరం బుద్గామ్‌లో కాల్చి చంపబడ్డాడు. ఇటువంటి హత్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆప్ నాయకులు డిమాండ్ చేసారు.
