మహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు... బహిష్కరించిన బిజెపి
న్యూఢిల్లీ, మీడియా పవర్ న్యూస్ డెస్క్: మహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు మరియు ట్వీట్లపై రగులుతున్న వివాదం నేపథ్యంలో బిజెపి ఆదివారం తన అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని బీజేపీ ఆయనను బహిష్కరించింది. "సోషల్ మీడియాలో మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు" బిజెపి నాయకుడు నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించినటు్ల ప్రకటించింది.
పార్టీ ఒక ప్రకటనలో "అన్ని మతాలను గౌరవిస్తుంది" మరియు ఏ మతపరమైన వ్యక్తినైనా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్న కొన్ని గంటలలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ దుమారానికి తెరలేపినట్టైంది. దీనితో బిజెపి సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ నూపుర్ శర్మకు నోటీసులు జారీచేసింది, “మీరు వివిధ విషయాలపై పార్టీ వైఖరికి విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారని, ఇది బిజెపి రాజ్యాంగంలోని రూల్ 10 (ఎ)ని స్పష్టంగా ఉల్లంఘించడమే అని పేర్కోంది. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉన్నందున మిమ్మల్ని పార్టీ మీ బాధ్యతల నుండి సస్పెండ్ చేసినట్లు జారీ చేసిన నోటీసులో పేర్కొంది.
అంతకుముందు రోజు, బిజెపి దాని ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, "ఏ మతానికి చెందిన ఏదైనా మతపరమైన వ్యక్తులను అవమానించడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే భావజాలానికి కూడా వ్యతిరేకం అని పేర్కోంది. ఏ మతాన్ని, వ్యక్తులను కించపరిచే భావజాలాన్నిలేదా తత్వాన్ని బిజెపి ప్రోత్సహించదని సంక్షిప్త ప్రకటన పేర్కొంది.
