ఘటనపై విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ | మీడియా పవర్ న్యూస్ డెస్క్: ఆదివారం ఉత్తరకాశీ జిల్లా దమ్టా సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవసాత్తు లోయలో పడి 22 మంది మరణించారు. ప్రాథమిక నివేదికల ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుండి యమునోత్రికి 28 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్గు సమాచారం. ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అభిషేక్ రుహెలా సహా సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మరోవైపు పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యలు చేపడుతున్నారు. 15 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, ఇతర క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని డీజీపీ అశోక్ కుమార్ ఆదివారం తెలిపారు. "ఉత్తరాఖండ్ స్థానిక అధికారులు అందించిన సమాచారం ప్రకారం, 22 మంది యాత్రికులు మరణించారనిమరియు 6 మంది గాయపడ్డారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ మీడియాకి తెలిపారు.
పీఎంఓ ఇండియా ట్వీట్ చేస్తూ, "ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ( ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో మాట్లాడి యాత్రికుల మృతికి సంతాపం తెలిపారు. ఆయన (హిందీలో) ట్వీట్ చేస్తూ"ఉత్తరాఖండ్‌లో భక్తుల బస్సు లోయలో పడిపోయిందన్న వార్త వినడం చాలా బాధగా ఉంది. నేను దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడాను. స్థానిక అధికారులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి మరియు గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారని, త్వరలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుంటుందదని తెలిపారు.ష మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ సీఎం విచారణకు ఆదేశించారు. ఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు.
