‘దక్షిణం’లో విభేదాలు.....దృష్ఠి సారించిన వైకాపా అధిష్ఠానం

MEDIA POWER
0

తాడేపల్లిలో సుబ్బారెడ్డిని కలిసిన సీతంరాజు 

విశాఖ‌ప‌ట్నం, మీడియా ప‌వ‌ర్‌: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య అంతః క‌ల‌హాల‌పై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. కొంత కాలం నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ల మధ్య నెలకొన్న అంతఃక‌ల‌హాలు ప‌తాక స్థాయికి చేరాయి. దీంతో వాసుపల్లి సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయవల్సిన తరుణంలో గ్రూపు రాజకీయాలు తీవ్రరూపం దాల్చడంతో అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.  దీంతో పార్టీ అధిష్ఠానం వాసుపల్లితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా ఫోన్ స్విచ్ ఆప్‌చేసిన‌ట్టు తెలుస్తోంది. సీతంరాజు సుధాకర్‌ను ఆదివారం సమన్వయకర్త సుబ్బారెడ్డి   తాడేపల్లికి వచ్చి కలవాలని పిలుపు ఇవ్వ‌డంతో హుటాహుటిన ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లి సుబ్బారెడ్డిని కలిశారు. పార్టీ అధిష్ఠానం చెప్పిన ప్రకారమే తాను ముందుకు వెళుతున్నానని, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు వివరించినట్లుతెలుస్తోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వ్యవహార శైలి, పార్టీ శ్రేణులకు ఎదురవుతున్న ఇబ్బందులను సైతం ఆయన సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.  మరోవైపు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై గుర్రుగా ఉన్న వాసుపల్లి తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. తనకు తెలియకుండా ఆలయ కమిటీలు, మసీదు, షాదీఖానా వంటి వాటికి పాలక వర్గాలు ఏర్పాటు చేయడం, ఆయా కమిటీలకు తాను ఇచ్చిన పేర్లను తొలగించడం, నియోజకవర్గంలో పోటీగా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై కలత చెందిన ఆయ‌న‌ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వాసుపల్లి చెప్ప‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పరిస్థితిపై ఇరు వర్గాలతో చర్చించి రాజీమార్గం అనుసరించాలని అధిష్ఠానం భావిస్తున్నప్ప‌టికీ ఇక్కడి పరిస్థితులు ఆ రకంగా లేవని పార్టీ వర్గాలు విశ్లేషించ‌డం మ‌రింన్ని రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకొనే వీలుంద‌ని విశ్లేష‌కుల వాద‌న‌.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">