గ్రామలు ప్రగతిపథంలో ఉండాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

MEDIA POWER
0

మాడుగుల: మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి  మండలం పెదనందిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.  ప్రభుత్వ పధకాల అమలు పై ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పథకాలు సక్రమం గా అందుతున్నాయా? లేదా అని అడిగారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు గారు,దేవరాపల్లి జెడ్పీటీసీ శ్రీ కర్రి సత్యం గారు, పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు గారు, మండల స్థాయి అధికారులు, దేవరాపల్లి మండల వివిధ గ్రామాల సర్పంచులు  ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">