వృద్ద కళాకారుల పింఛన్ల దరఖాస్తులకు ఆహ్వనం

MEDIA POWER
0


విశాఖపట్నం: జిల్లాలోని రంగస్థల వృద్ద కళాకారులకు    కొత్తగా  ఫించన్లు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు,  ఉపసంచాలకులు  జిల్లా సమాచార పౌర  సంబంధాల కార్యాలయం ఉపసంచాలకులు  వి.మణిరామ్  తెలిపారు. జిల్లా  కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైల్లో  లబ్దిదారుల నుండి దరఖాస్తులను అహ్వనిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఆయన ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేశారు.  ఏదైనా కళారంగానికి చెంది, 58 సంవత్సరములు వయసు నిండిన వారు, తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వృద్ద కళాకారులు ఫించను కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత దరఖాస్తులను, ఉపసంచాలకులు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం లేదా Visakhapatnam.ap.gov.in  వెబ్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని తెలిపారు.  నిర్ణీత ప్రోపార్మలో పూర్తి చేసిన దరఖాస్తులు  ఆగస్టు నెల 31వ  తేదిలోగా స్వయంగా ఉపసంచాలకులు జిల్లా సమాచార పౌర సంబందాల కార్యాలయం, రెడ్ క్రాస్ బ్లెడ్ బ్యాంక్ దగ్గర, సెట్వీస్ కార్యాలయం ప్రాంగణంలోని  సమాచార భవన్,  కృష్ణానగర్  విశాఖపట్నం-530002, చిరునామాలో  అందజేయాలని పేర్కొన్నారు.  దరఖాస్తుతో పాటు  రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, కళాకారునిగా గుర్తింపు పత్రం, ఆదాయ దృవీకరణ పత్రం ,ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా బియ్యం కార్డుల జెరాక్స్  కాపీలను తప్పని సరిగా జత చేయాలని సూచించారు.  ఈ అవకాశాన్ని  వృద్ద కళాకారుఐ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">