విశాఖపట్నం: జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పగడ్బందిగా చేయాలని అదికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్య దినోత్సవ వేడుకలకు సంబందించి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు పేరేండ్ గ్రౌండు ను వేడుకలు నిర్వహించుకోవడానికి సిద్దం చేయాలన్నారు. పూలతో స్టేజ్ డెకరేషన్ సంబందిత పనులను చేయాలని ఆర్టికల్చర్ అధికారులను ఆదేశించారు. అదే విదంగా గ్యాలరీలో ఉండే విద్యార్ధిని, విద్యార్ధులు పోలీసు పేరేండ్ గ్రౌండు కు వచ్చిన వారికి మంచినీటి సౌకర్యం, శానిటేషన్ సౌకర్యాలు ఉండేలాగా ఏర్పాట్లు చేయని జి.వి.ఎం.సి అధికారులను ఆదేశించారు. షామియానాలు, విఐపి యాజి సోఫాలు, కుర్చీలు స్థానిక మండల రెవెన్యూ అధికారులు సిద్దం చేయాలన్నారు. స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. శానిటైజర్, మాస్కుల పంపిణీ, ప్రదమ చికిత్సతో కూడిన స్టాల్ ను మరియు అంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి ఆదేశించారు. విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని, అదే విదంగా జనరేటర్ ను ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు. అదే విదంగా వేడుకలలో భాగంగా జిల్లా ప్రగతిని సూచించే శకటాలు , స్టాల్స్ ఏర్పాట్లు గురించి వివిద శాఖలతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, ఆర్ డి ఓ హుసేన్ సాహేబ్, పోలీసు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default
